భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌కు కరోనా..

234
Sunil Chhetri
- Advertisement -

ఇండియా ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌, స్టార్‌ స్ట్రైకర్‌ సునీల్‌ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు వైరస్‌ సోకిందని బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ ట్విటర్లో వెల్లడించాడు. ఇదిలా ఉంటే సునీల్‌ ఛెత్రి గతకొన్ని రోజుల క్రితం గోవాలో జరిగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఆడాడు. ఈ టోర్నీలో సునీల్‌ బెంగళూరు ఎఫ్‌సీ తరపున ఆడాడు. తనకు కరోనా పాజిటివ్‌ అని తెలిపిన సునీల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఇది శుభవార్త కాదు.. నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. వైరస్‌ నుంచి క్రమంగా కోలుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ ఫుట్‌ బాల్‌ మైదానంలోకి అడుగుపెడతాను. కరోనా విషయంలో ఎవరూ అజాగ్రత్తగా ఉండకండి.. ప్రతీ ఒక్కరూ తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇక దుబాయ్‌ వేదికగా ఒమన్‌తో మార్చి 25న జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సునీల్‌ దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే వేదికపై మార్చి 29న యూఏఈతో జరిగే స్నేహపూర్వక మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా కరోనా తన పంజాను విసురుతూనే ఉంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్లీ తన పంజాను విసురుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి.

- Advertisement -