కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయసంగా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు రెండో వన్డేలో కూడా ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50ఓవర్ల కంటే ముందుగా 39.4ఓవర్లో 215పరుగులకు ఆలౌటైంది. అయితే చేధనకు దిగిన భారత్ ఆదిలో కొంతమేర తడబడింది. శ్రీలంక బౌలర్లు ఒకానొక దశలో భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఒత్తడిలోకి నెట్టారు. కేవలం 86పరుగులే కీలకమైన నాలుగు వికెట్లు తీశారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ హార్ధిక్ పాండ్యా లు ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 75పరుగులు జోడించారు. హార్ధిక్ అవుట్ అయ్యాక అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో కలిసి రాహుల్ జట్టును గెలిపించాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, కరుణరత్నే రెండు వికెట్లు తీశారు. కసిన్ రజిత, ధనంజయ డిసిల్వాకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకు ముందు బ్యాటింగ్ లంక ఫెర్నాండో 50పరుగులతో జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి కట్టడి చేశారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్‌కు రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి…