ఉప్పల్‌లో భారత్ – కీవిస్ వన్డే మ్యాచ్‌..

57
- Advertisement -

నాలుగు సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది ఉప్పల్ స్టేడియం. ఈ నేపథ్యంలో మీడియాకు వివరాలను వెల్లడించారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్. జనవరి 18 మ్యాచ్ కోసం కేవలం ఆన్ లైన్ లో (పెటియం) మాత్రమే…ఆఫ్ లైన్ టికెట్ అమ్మడం లేదన్నారు. మ్యాచ్ కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అన్నారు.

Lb స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలన్నారు.బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగ కుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.

క్రీడాభిమానులు అందరు సహకరించి మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలని..రాచకొండ పోలీసులు, డిజిపీ సహకారం మాకు ఎంతో ఉందన్నారు. గతంలో జరిగిన లోటు పాట్లను HCA సవరించుకొందని…ఈ సారి ఆఫ్ లైన్లో టికెట్స్ విక్రయాలు జరపడం లేదన్నారు. మొత్తం టికెట్స్ ఆన్ లైన్ లోనే పెడుతున్నామని..ఈ సారి కూడా మెట్రో రైల్ 1 గంట వరకు సమయం కావాలని కోరామన్నారు.

ఆన్లైన్ టికెట్ లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. జనవరి 13 6వేల టికెట్,జనవరి 14 7వేల టికెట్,జనవరి 15 7వేల టికెట్,జనవరి 16మిగతా టికెట్స్ అమ్మకాలు జరగనున్నాయి. స్టేడియం కెపాసిటీ 39,112 కాగా కాంప్లమెటరి టికెట్స్ 9695,29417 టికెట్స్ అమ్మకానికి,ఆన్లైన్ టికెట్ తీసుకునేవారు కేవలం 4టికెట్ లు మాత్రమే తీసుకోవాలన్నారు.

జనవరి 14 న హైదరాబాద్‌కి న్యూజిలాండ్ టీమ్ చేరుకోనుందని, 15న న్యూజిలాండ్ సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుందన్నారు.జనవరి 16 టీమ్ ఇండియా సిటీ కి చేరుకుంటుందని, 17న ప్రాక్టీస్ ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -