వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీంఇండియా విజయం సాధించింది. మూడు టీ20లో భాగంగా మొదటి మ్యాచ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ నిర్ణిత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి కేవలం 95పరుగులు మాత్రమే చేసింది. విండీస్ ఆటగాళ్లలో పొల్లార్డ్ మాత్రమే రాణించాడు. 49బంతుల్లో 49పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం 96 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఒక్క పరుగుకే అవుటై నిరాశ పరిచినప్పటికీ రోహిత్ శర్మ (24), కెప్టెన్ కోహ్లీ (19), మనీష్ పాండే (19), కృనాల్ పాండ్యా (12), రవీంద్ర జడేజా (10), వాషింగ్టన్ సుందర్ 9(8) పరుగులు చేశారు.మూడు వికెట్లు తీసి భారత విజయం కీలక పాత్ర పోషించిన నవ్‌దీప్ సైనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.