రాబోయే ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ రోజు (మే 2) భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.జట్టును హర్మన్‌ప్రీత్ కౌర్ నడిపించనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకుని, ప్రపంచకప్‌కు అవసరమైన అత్యుత్తమ 15 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ వంటి ఆటగాళ్ల ఎంపికపై ఆసక్తి నెలకొంది.దేశవాళీ క్రికెట్ మరియు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాణించిన ఒకరిద్దరు కొత్త ముఖాలకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ ఏడాది చివరలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత కొన్ని ఐసీసీ టోర్నీల్లో సెమీఫైనల్, ఫైనల్ వరకు వచ్చి తృటిలో చేజార్చుకున్న కప్పును ఈసారి ఎలాగైనా ముద్దాడాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.
Also Read:ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్

