ఢిల్లీ స్కూల్స్‌..ఫీజల వసూలపై!

3
- Advertisement -

ఢిల్లీలోని గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఒక నెల కంటే ఎక్కువ ఫీజును ఒకేసారి వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా చాలా పాఠశాలలు మూడు నెలల (Quarterly) ఫీజును ముందస్తుగా కట్టించుకుంటాయి. అయితే, ఇకపై అటువంటి పద్ధతిని అనుసరించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పాఠశాలలు భారీ మొత్తంలో ఫీజులను ఒకేసారి డిమాండ్ చేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.ఒకవేళ ఏ పాఠశాలైనా ఈ నిబంధనలను అతిక్రమించి, ఒక నెల కంటే ఎక్కువ ఫీజును వసూలు చేస్తే, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

పాఠశాలలు తమ ఫీజుల నిర్మాణాన్ని పారదర్శకంగా ఉంచాలని, అదనపు ఛార్జీల పేరుతో తల్లిదండ్రులను వేధించకూడదని అధికారులు పేర్కొన్నారు.ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. నెలవారీ ఫీజు పద్ధతి వల్ల కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి తగ్గుతుందని విద్యాశాఖ అభిప్రాయపడింది.

Also Read:ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్‌

- Advertisement -