ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్‌

10
- Advertisement -

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా మేము బయట పెట్టాము అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. R&B , పంచాయతీ రాజ్ లో 25 టెండర్ లను ఎక్సెస్ టెండర్ లతో కొందరికి మాత్రమే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆనాడే చెప్పాము.మేము చెప్పింది నిజమైంది, హ్యమ్ మోడల్ రోడ్ల టెండర్ లో 25 శాతం ఎక్సెస్ తో టెండర్ వేశారు అన్నారు.

హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది…R&B లో 11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్ తో కలిసి దాదాపుగా 15 వేల కోట్ల రూపాయల వరకు పోయింది…పంచాయతీ రాజ్ లో 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది …ఎక్సెస్ టెండర్ వల్ల 5 వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పై పడుతుంది…హ్యమ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 ఇన్స్టాల్ మెంట్ లో 15 సంవత్సరాల పాటు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది…ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల పై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాల పై తీవ్రమైన భారం పడుతుంది అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా, పరోక్షంగా అప్పులు చేస్తున్నాడు…ఈ టెండర్ లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది..ప్రాణహిత చేవెళ్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం…ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడాడు…అప్పుడు అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చాడు…2014 బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశాము…మా హయంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీ కాల్ చేసేవాళ్ళం….ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్న పట్టించుకోవడం లేదు..ఎక్సెస్ టెండర్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము….టెండర్ లు అన్ని రీ కాల్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతుంది. …ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆధారాలతో సహ మేము వివరించాము…రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటాడు, రేపు పోతాడు..ఎక్సెస్ టెండర్ ల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై భారం పడుతుంది అన్నారు.

ఈ టెండర్ లలో ఒక కంపెనీకి 15 టెండర్ లు దక్కబోతున్నాయి…తొందరలోనే ఆధారాలతో సహ బయటపెడుతాను..R&B లో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు , పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవి కాలం పొడిగించి ఈ టెండర్ ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు….ప్రధానమైన ఇంజనీరింగ్ లో ముఖ్యమైన అధికారులను ఎక్స్ టెన్షన్ చేస్తున్నారు…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్ టెన్షన్ ఉండదని మాట్లాడిన రేవంత్ రెడ్డి…అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో అధికారులను ఎక్స్ టెన్షన్ ఇస్తున్నారు…వెంటనే ఎక్సెస్ టెండర్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

- Advertisement -