కొలంబో టెస్ట్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఇన్నింగ్స్ 53 పరుగులు తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగా టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 386 కు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా ప్రతిఘటించినా.. ఇన్నింగ్స్ ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది శ్రీలంక. ఓపెనర్ కరుణరత్నె (141), మెండిస్ (110) సెంచరీలతో చెలరేగినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 5 వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్‌తోనూ రాణించి 70 రన్స్ చేసిన జడేజా.. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీయడం విశేషం.
India beat Sri Lanka by an innings and 53 runs in Colombo, @imjadeja's 5/152 taking the visitors to a 2-0 series lead! #SLvIND pic.twitter.com/uaihIVCui6
— ICC (@ICC) August 6, 2017
22 ఏళ్ల తర్వాత 2015లో తొలిసారి విరాట్ సారథ్యంలోని సిరీస్ నెగ్గిన టీమిండియా.. శ్రీలంకను వాళ్ల గడ్డపై వరుసగా రెండో టెస్ట్ సిరీస్‌లోనూ ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (133), రహానే (132) సెంచరీలు చేయగా.. రాహుల్, అశ్విన్, సాహాన, జడేజా హాఫ్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్లకు 622 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. లంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 5 వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్ట్‌ను కూడా నాలుగు రోజుల్లోనే ముగించిన భారత్.. రెండో టెస్ట్‌ను కూడా మరో రోజు మిగిలుండగానే చేజిక్కించుకుంది.