భారత్‌ – జింబాబ్వే మూడో వన్డే !

63
ind
- Advertisement -

భారత్ – జింబాబ్వే మధ్య ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈ వన్డేలో గెలిచి సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌మీదున్నారు. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డేల్లో ధవన్‌ ఆకట్టుకోగా, గిల్‌ అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత పరిణతి సాధిస్తూ పరుగులు కొల్లగొడుతున్నాడు. బౌలింగ్‌లో యువ పేసర్లు మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ నిలకడగా రాణిస్తున్నారు. ఇక చివరి మ్యాచ్‌లోనైనా టీమ్‌ఇండియాకు కనీస పోటీనివ్వాలని జింబాబ్వే కృతనిశ్చయంతో ఉంది.

జట్ల అంచనా

భారత్‌: రాహుల్‌(కెప్టెన్‌), ధవన్‌(వైస్‌ కెప్టెన్‌)/రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శాంసన్‌, అక్షర్‌ పటేల్‌/షాబాజ్‌ అహ్మద్‌, శార్దుల్‌ ఠాకూర్‌/దీపక్‌ చాహర్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌

జింబాబ్వే: కైతానో, ఇన్నోసెంట్‌ట కైయా, రెజిస్‌ చక్‌బవా, వెస్లీ మెద్వెరె/టోనీ మున్యోగ్న, సికందర్‌ రజా, సీన్‌ విలియమ్స్‌, ర్యాన్‌ బర్ల్‌, ల్యూక్‌ జాన్వె, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ నౌచీ, తనా చివాంగ.

- Advertisement -