ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఉమేష్ యాదవ్ వ్యన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. ఉమేష్ ధాటికి ఓవర్ నైట్ స్కోరు 295/7తో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 311 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాట్స్ మెన్ రోస్టన్ ఛేజ్(106)పరుగులతో ఆకట్టుకున్నాడు. టెస్టు కెరీర్‌లో అతనికిది నాలుగో సెంచరీ కాగా భారత్‌కిది రెండోది.
తొలిరోజు జేసన్ హోల్డర్(52) అర్ధశతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాటంతో విండీస్ 300 పరుగుల మార్క్‌ను ధాటింది. భారత పేస్ బౌలర్ శార్దూల్ ఆరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే నిరాశపర్చాడు. గాయం కారణంగా మూడు ఓవర్లు మాత్రమే వేసి రెస్ట్‌లో ఉన్నాడు. దీంతో పేస్ బౌలింగ్ బాధ్యతను భుజానా వేసుకున్న ఉమేష్..విండీస్ బ్యాట్స్‌మెన్ తిప్పలు పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఉమేశ్ (6/88) సంచలన ప్రదర్శన చేశాడు. టెస్టు కెరీర్‌లో ఉమేశ్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు.
తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన భారత్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వి షా మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షా 52,పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.