నేడే విండీస్‌తో భారత్‌ చివరి టీ20..

94
India vs West Indies

నేడే విండీస్‌తో భారత్‌ చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ చెన్నైలోని ఎమ్‌ ఎ చిదంబరం స్టేడియంలో రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ గెలుచుకున్న భారత్‌.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది.

India vs West Indies

సీనియర్లు మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి లేకపోయినా.. తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌శర్మ సారథ్యంలో టీమ్‌ఇండియా చెలరేగి ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కరీబియన్‌ జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా రోహిత్‌ బ్యాట్స్‌మన్‌గా మంచి ఊపు మీదున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అతను అదే జోరు ప్రదర్శిస్తే భారత్‌కు తిరుగుండదు.