సంక్రాంతికి అజిత్ ‘విశ్వాసం’..

247
Ajith's Viswasam
- Advertisement -

తమిళనాట స్టార్ హీరోగా అజిత్ దూసుకుపోతున్న విషయం తెలిపిందే. అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘విశ్వాసం’ ఈ మూవీతో అజిత్‌ సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో శివ – అజిత్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. నాల్గొవ సినిమాగా ‘విశ్వాసం’ రూపొందుతుండడం విశేషం.

Ajith's Viswasam

ఇక ఈ మూవీలో అజిత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇటీవల పూణెలో జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -