భారమంతా వీరిద్దరి పైనే..!

219
India vs South Africa, 1st Test, Day 1 Highlights
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా బౌలింగ్‌లో రాణించిన బ్యాటింగ్లో మాత్రం తడబడింది. సఫారీలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 30 పరుగులైనా చేయకుండా 3 కీలక వికెట్లను సమర్పించుకుంది.

ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ మురళీ విజయ్ (1) ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 18 పరుగులే. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (5) జట్టును ఆదుకుంటాడని అందరూ భావించారు. అయితే మోర్కెల్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

India vs South Africa, 1st Test, Day 1 Highlights

ప్రస్తుతం చటేశ్వర్  పుజారా (5), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు.  ఇంకా 258 పరుగులు చేస్తేనే దక్షిణాఫ్రికాకు ఆధిక్యం కోల్పోకుండా ఉంటుంది. వీరిద్దరికీ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే అనుభవం ఉండడంతో తొలి ఇన్నింగ్స్ ఇప్పుడు వీరి భుజాలపైనే ఉంది.

అంతకముందు సఫారీ బ్యాట్స్‌మెన్‌కు సీమర్ భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించారు .తొలిస్పెల్‌లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కొలుకోనివ్వలేదు.  ఏబీ డివిలియర్స్ (65), కెప్టెన్ డుప్లెసిస్ (62), క్వింటన్ డికాక్ (43) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఫలితంగా దక్షిణాఫ్రికా 286 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భువనేశ్వర్ కుమార్ 4, అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా, పాండ్యా, బుమ్రా, షమీ తలో వికెట్ తీశారు.

- Advertisement -