న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియా మరో పోరుకు తలపడుతోంది. టీమిండియా ఐదో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు ‘సూపర్’ థ్రిల్లర్ విజయాలతో కొండంత ఆత్మవిశ్వాసం నింపుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోను గెలిచి వైట్ వాష్ చేయాలని భావిస్తుంది.
ఇక వరుస పరాజయాలు చవిచూస్తున్న కివీస్ టీం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. కోహ్లీకి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినివ్వడంతో భారత టీం కెప్టెన్‌గా రోహిత్ ఉన్నారు. రిషభ్ పంత్‌కు అవకాశం దక్కుతుందని భావించినా అది జరగలేదు.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: టిమ్ సౌతీ(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, టామ్ బ్రూస్, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్లీన్, సోధి, బెన్నెట్.