ఆసీస్,భారత్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. టీ20 సిరీస్‌లో భాగంగా మూడో టీ20 కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. మెుదటిగా టాస్ గెలిచిన భారత్ . పీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తొలి రెండు టీ20 మ్యాచ్ లు గెలిచిన కోహ్లీ సేన సిరీస్ కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే టీ20 మ్యాచ్ కాబట్టి వినోదానికి లోటు ఉండకపోవచ్చు.
ఆసీస్ జట్టులో ఒక మార్పు జరిగింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ జట్టులోకి రాగా, ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఇక, టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. రెండో టీ20 ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో బరిలో దిగుతోంది. రెండో మ్యాచ్ లో చిచ్చరపిడుగులా చెలరేగి ఆడిన హార్దిక్ పాండ్యపై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహంలేదు.
భారత్ తుది జట్టు : శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సంజు సామ్సన్, శ్రేయస్ అయ్యార్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, టి నటరాజన్, శార్ధుల్ ఠాకూర్ ,యుజ్వేంద్ర చాహల్
ఆసీస్ తుది జట్టు : ఆరోన్ ఫించ్, డి ఆర్సీ షార్ట్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మొయిసెస్ హెన్రిక్స్, మాథ్యూ వేడ్ , డేనియల్ సామ్స్, సీన్ అబోట్, మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జాంపా, ఆండ్రూ టై