అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయం..

96
- Advertisement -

అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను భారత కుర్రాళ్ల జట్టు చిత్తుచేసింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో నెగ్గిన మన కుర్రాళ్లు.. రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ముందుగా భారత పేసర్లు రాజ్‌ బవా (5/31), రవి కుమార్‌ (4/34)ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్‌ రూ (95) ఒక్కడే పోరాడాడు. ఛేదనలో భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసి గెలిచింది. తెలుగు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (50) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, నిశాంత్‌ సింధు (50 నాటౌట్‌), రాజ్‌ బవా (35) ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాజ్‌ బవా నిలిచాడు.

స్కోర్ బోర్డు:

ఇంగ్లండ్‌: 44.5 ఓవర్లలో 189 ఆలౌట్‌ (జేమ్స్‌ రూ 95, జేమ్స్‌ సేల్స్‌ 34 నాటౌట్‌, జార్జ్‌ థామస్‌ 27, రాజ్‌ బవా 5/31, రవికుమార్‌ 4/34).

భారత్‌: 47.4 ఓవర్లలో 195/6 (షేక్‌ రషీద్‌ 50, రాజ్‌ బవా 35, నిషాంత్‌ సింధు 50 నాటౌట్‌, హర్నూర్‌ సింగ్‌ 21, యశ్‌ ధుల్‌ 17, దినేశ్‌ బనా 13 నాటౌట్‌, జోషువా బోయ్డెన్‌ 2/24, జేమ్స్‌ సేల్స్‌ 2/51, థామస్‌ అస్పిన్‌వాల్‌ 2/42).

- Advertisement -