హిస్టరీ క్రియేట్ చేసిన కోహ్లీ సేన..

275
India Team win First odi series in SouthAfrica
- Advertisement -

సఫారీ గడ్డపై టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. రెండున్నర దశాబ్దాలపాటు సఫారీ గడ్డపై ఏ ఫార్మాట్లోనూ టీమిండియా విజేతగా నిలిచిన సందర్భంలేదు. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది కోహ్లి సేన. ఆ దేశంలో సఫారీలపై సిరీస్‌ విజయం సాధించిన ఫస్ట్ జట్టుగా నిలిచింది.

పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో ఆతిథ్య సఫారీ జట్టును 73 పరుగులతో ఓడించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. సారథిగా 48 వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన విరాట్‌కు ఇది 37వ విజయం కావడం విశేషం. టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా చిరస్మరణీయ గెలుపుపై భారత మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పశంసల జల్లు కురిపిస్తున్నారు.

()సిరీస్‌ టీమిండియా వశమైంది. మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌ ఆకట్టుకున్నారు. రోహిత్‌ శర్మ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్‌: సచిన్‌ టెండూల్కర్‌

()సఫారీ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు. ఈ పర్యటనలో భారత జట్టు ఎంతో నిలకడగా ఆడుతూ విజయాలను సొంతం చేసుకుంది. ఈ జట్టు ఎంతో ప్రత్యేకమైనది: వీరేంద్ర సెహ్వాగ్‌

() చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఈ విజయం విరాట్‌ కోహ్లీతో పాటు సహచర ఆటగాళ్లకు ఎంతో తియ్యనిది. సఫారీగడ్డపై బాగా ఆడుతున్నారు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

() కోహ్లీ సేనకు ఇది మరిచిపోలేని సమయం‌. సఫారీ గడ్డపై గతంలో ఏ భారత జట్టు సాధించలేని ఘనతను ఈ జట్టు సాధించింది: హర్ష భోగ్లే

()విరాట్‌ కోహ్లీ, భారత జట్టుకు అభినందనలు. మరో అద్భుత ప్రదర్శనతో టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకుంది. కోహ్లీ సేన అంటే ఇదే. ఇది ప్రత్యేకమైన జట్టు. గొప్ప ఫలితం: మహమ్మద్‌ కైఫ్‌

- Advertisement -