నన్ను చూసి ఏడవకండి…!

439
Sunny leone Starecrow to save crops
- Advertisement -

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన సెక్సీ బాంబ్ సన్నీలియోన్‌. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో సన్నీ ఒక శృంగార దేవత. అందుకే ఈమె అందాలు అడ్డు పెట్టుకుని క్యాష్‌ చేసుకోవాలని దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతవరకు సన్నీ నటించిన సినిమాల్లో కథ లేకుండానే మొత్తం ఆరబోతతోనే కథల్ని తెరకెక్కించారంటే అది సన్నీ క్రేజ్. ఈ నేపథ్యంలో సన్నీ క్రేజ్‌ని వాడుకునేందుకు ముందుకొచ్చారు ఏపీ రైతులు.

సాధారణంగా పంట పొలాల దగ్గర నరుల చూపు పంటపై పడకుండా దిష్టి బొమ్మలు పెడతారు రైతులు. ఇది కామన్. ఇందుకు భిన్నంగా ఆలోచించారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రైతులు. దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల్లో రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ కూరగాయల సాగు చేపట్టారు. వందల ఎకరాల్లో సాగు చేసిన ఈ పంట బాగా వచ్చింది. చెట్లకు బెండ కాయలు నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. పెద్దపెద్ద క్యాబేజీలు, క్యాలీఫ్లవర్స్ అటుగా వెళ్లే వారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Sunny leone Starecrow to save crops

ఈ నేపథ్యంలో నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందని ఓ నమ్మకం. అదే నమ్మకాన్ని ఫాలోఅవుతూ . అటుగా వెళ్లే వారి చూపు పంటపై పడకుండా.. పొలాల మధ్యలో పెద్ద పెద్ద సన్నిలియోన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా అని స్లోగన్స్ రాశారు. దీంతో అటుగా వెళ్లే వారి చూపు అంతా ఇప్పుడు ఫ్లెక్సీలపై పడింది. పంటపై కాకుండా ఇప్పుడు ఈ ఫ్లెక్సీపై మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -