టీంమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అత్యధికంగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లలో మొదటి స్ధానంలో ఉన్నాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న కోహ్లి.. తాజాగా 14 పాయింట్లు సాధించి మొత్తం 934 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన రెండవ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే .ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాట్స్‌మెన్స్ లో రెండవ స్దానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు. కోహ్లీ, విలియమ్సన్ మధ్య 19 పాయింట్ల తేడా ఉంది.టామ్ లాథమ్, ఏంజిలో మాథ్యూస్, నాథన్ లియాన్‌లు కూడా తమ ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇక భారత బౌలర్లు మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలు తమ బౌలింగ్ ను మెరగుపరచుకున్నారు.