మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన బాల‌కృష్ణ‌…

237
balakrishna
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బిజీగా ఉన్నాడు. ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈమూవీలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈచిత్రాన్ని క‌థానాయుకుడు, మ‌హానాయకుడు అని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. జ‌న‌వ‌రి 9వ తేదిన క‌థానాయ‌కుడు చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ntr biopic

రేపు హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ ట్రైల‌ర్, ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇక బాల‌కృష్ణ ఈసినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు వివి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుందని స‌మాచారం. ఈమూవీతో పాటు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా చేయ‌నున్నాడు బాల‌య్య.

- Advertisement -