- Advertisement -
న్యూజిలాండ్ మహిళా జట్టు టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా న్యూజిలాండ్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న వైట్ ఫెర్న్స్ సంబరాలు అంబరాన్నంటాయి.
భారత్ జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 71 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. లియా తహుహు మూడు వికెట్లు, అమీలా కెర్ర్ మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కాగా మెగాటోర్నీలో టీమిండియాకు ఇది తొలి పరాజయం. న్యూజిలాండ్ కు వరుసగా రెండో విక్టరీ.
- Advertisement -