దేశంలో కొత్తగా 7081 కరోనా కేసులు..

85

భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో కొత్తగా 7081 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,40,275కు పెరిగింది. ఇందులో 4,77,422 మంది మరణించగా, 3,41,78,940 మంది బాధితులు కోలుకున్నారు. మరో 83,913 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కొత్తగా 264 మంది మరణించగా, 7469 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.24 శాతమని, రికవరీ రేటు 98.38 శాతంగా ఉందని, మరణాల శాతం 1.37 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు వరకు 1,37,46,13,252 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 76,54,466 మందికి కరోనా టీకా వేశామని తెలిపింది. డిసెంబర్‌ 18 వరకు దేశవ్యాప్తంగా 66,41,09,365 నమూనాలను పరీక్షించామని, ఇందులో శనివారం 12,11,977 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.