- Advertisement -
దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.. నిన్న మొన్నటి వరకు కేసులు పెరగ్గా.. శుక్రవారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 51,667 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… గత 24 గంటల్లో 64,527 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది.
కొత్తగా 1,329 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.
- Advertisement -