- Advertisement -
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అయితే గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,30,289 మంది కోలుకోగా… 3,449 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది.
ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో 2,02,82,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,66,13,292 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 34,47,133 మందికి చికిత్స జరుగుతోంది. 15,89,32,921 మందికి కొవిడ్ టీకాలు వేశారు.
- Advertisement -