దేశంలో 24 గంటల్లో 2,34,692 కరోనా కేసులు

45
corona

దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకి రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా గత 24 గంట‌ల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకున్నాయి.

ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740గా ఉండగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 1,75,649 మంది చ‌నిపోయారు. 1,26,71,220 మంది వైర‌స్ నుంచి కోలుకోగా 11,99,37,641 మంది క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.