వివేక్ మృతిపట్ల ఎంపీ సంతోష్ సంతాపం…

50
santhu

ప్రముఖ తమిళ హాస్యనటుడు, ప్రకృతి ప్రేమికుడు వివేక్ మృతిపట్ల సంతాపం తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్…వివేక్ ఆకస్మికమరణం తనని కలిచివేసిందన్నారు. వివేక్ ప్రకృతి ప్రేమికుడని గ్రీన్ కలం ప్రాజెక్టు ద్వారా దాదాపు 32 లక్షలకుపైగా మొక్కలు నాటాడని కొనియాడారు. ప్రకృతి మిమ్మలను ఎప్పటికి గుర్తుంచుకుంటుందని తెలిపారు సంతోష్.

దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించాడు వివేక్. 2009లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నాడు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్, విశాల్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన వివేక్ త‌మిళంలో టాప్ క‌మెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.