దేశంలో కొత్తగా 1.67 లక్షల కరోనా కేసులు..

59
- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2 లక్షల కంటే తక్కువగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో 1,192 మంది కరోనా కారణంగా మృతి చెందగా… 2,54,076 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,66,68,48,204 డోసుల వ్యాక్సిన్ వేశారు

- Advertisement -