భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పుడుతోంది. దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. అలాగే, నిన్న 22,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,33,42,901కు చేరింది. నిన్న కరోనాతో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 4,51,189కు పెరిగింది.
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,07,653 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 50,63,845 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన డోసుల సంఖ్య 96,43,79,212కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, అక్టోబర్ 12 వరకు దేశవ్యాప్తంగా 58,63,63,442 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించింది. ఇందులో నిన్న ఒకేరోజు 13,25,399 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.