శంకర్ సినిమా కోసం రామ్ చరణ్‌కు భారీ పారితోషికం..

25
Ram Charan

తమిళ టాప్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్ల బడ్జెట్టుతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అయితే మెగా హీరో రామ్ చరణ్ ఈ చిత్రానికి భారీగా పారితోషికం తీసుకుంటున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీలో నటించడాని చరణ్ 80 కోట్లు తీసుకుంటున్నాడట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా అనేది చూడాలి.