కల్నల్ సంతోష్ త్యాగం మరువలేనిది:కేటీఆర్,జగదీశ్

434
santhosh
- Advertisement -

భారత- చైనా సరిహద్దుల్లో మృతిచెందిన కల్నల్ సంతోష్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి. తెలంగాణకు చెందిన సంతోష్‌తో పాటు మరో ఇద్దరుజవాన్లు మరణించడం తనను కలచివేసిందని దేశానికి మీరందించిన సేవలు ఎప్పటికి మరచిపోలేమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్.

సూర్యాపేటలో అమర జవాన్ సంతోష్ బాబు తల్లిదండ్రులను ,కుటుంబ సబ్యులను పరామర్శించి ఓదార్చిన మంత్రి జగదీష్ రెడ్డి. గంట కు పైగా సంతోష్ తల్లిదండ్రులతో ఉండి దైర్యం చెప్పారు. సంతోష్ త్యాగం మరువలేనిదని… కన్న కొడుకు ను కొల్పయిన బాధ ను దిగ మింగి దేశం కోసం తమ కుమారుడు ప్రాణాలు ఇచ్చినందుకు గర్వం గా ఉందన్న సంతోష్ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ అన్నారు.

సంతోష్ తల్లిదండ్రులను చూసి దేశం గర్వ పడాలని…సంతోష్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.సంతోష్ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇవాళ క్లారిటీ వస్తుందని అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించినా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం యంత్రాంగం సిద్దం గా ఉందన్నారు.

- Advertisement -