- Advertisement -
గతేడాది సంభవించిన భూకంపాలు,ప్రకృతి విపత్తుల్లో దెబ్బతిన్న వారికి సాయంగా నేపాల్‌కు 1.54 బిలియన్ (రూ.154 కోట్లు) నిధులిచ్చింది భారత్. నేపాల్‌లో భారత రాయబార కార్యాలయానికి చెందిన డిప్యూటీ చీఫ్ నాంగ్యా ఖంపా, ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిషీర్ కుమార్ ధుంగనాకు ఈ చెక్కును గురువారం అందజేశారు.
గత ఏడాది భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా నేపాల్‌లో వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. నాడు భారత్ ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం రూ.154 కోట్ల నిధుల చెక్కును నేపాల్‌కు అందజేసింది.
- Advertisement -