కొత్త రెవెన్యూ చట్టంతో లాభసాటిగా వ్యవసాయం:హరీశ్

153
harishrao

రైతాంగాన్ని సంఘటితం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. రాయపోల్ మండలంలో రైతులకు పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన హరీశ్‌ రావు…జనాభాలో 60 శాతం ఉన్న రైతులు ఒక్కతాటి మీదకు వచ్చి వ్యవసాయం లాభాల బాటపడితే దాని మీద ఆధారపడ్డ మిగిలిన వర్గాలు సంతోషంగా ఉంటాయి అని అన్నారు..

రైతువేదికల నిర్మాణం పూర్తయితే తెలంగాణ వ్యవసాయంలో నూతన విప్లవం మొదలవుతుంది అని అన్నారు.రాబోయే రోజులలో దేశానికి తెలంగాణ రైతాంగం దిక్సూచి లా నిలుస్తుంది అన్నారు.వర్షాలు కూడా ఈ సంవత్సరం సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు.

24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఘనత తెరాస పార్టీది అన్నారు..ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెల్వని పరిస్థితి అని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని అన్నారు.మొన్న కారోన ప్రభావం ఉన్న కానీ ప్రతి ధాన్యాపు గింజ కొనుగోలు చేశామని, అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వడం జరిగిందని అన్నారు.బీడీ కార్మికులకు, వితంతువులకి, వృద్ధులకి, అందరికి ఆసరాగా తెరాస ప్రభుత్వం ఉన్నదని అన్నారు.