తనకు ఎలాంటి సమన్లు అందలేదు: రకుల్

231
rakul

ముంబై డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీపిక పదుకొణె,సారా అలీ ఖాన్,శ్రద్దా కపూర్,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు సమన్లు అందాయని వార్తలు వెలువడ్డాయి.

దీంతో ఈ వార్తలపై స్పందించింది రకుల్ ప్రీత్ సింగ్. తనకు ఎలాంటి సమన్లు అందలేదని స్పష్టం చేసింది రకుల్. హైదరాబాద్ లో కానీ ముంబై లో గాని తనకు ఎలాంటి సమన్లు రాలేదని తెలిపింది.

అయితే ఎన్సీబి అధికారులు మాత్రం తాము రకుల్ ను సంప్రదించడానికి అన్ని విధాలా ప్రయత్నించమని ఆమె నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే ఈ కేసులో దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.