భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ గౌరవప్రదమైన స్కోర్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఐదో వన్డేలో 49.5 ఓవర్లకి గాను 252 పరుగులు చేసి కివీస్‌కు భారీ టార్గేట్‌ను ఇచ్చింది. ఇక ఆట ఆరంభంలో తడబడ్డ భారత్ 18 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న భారత్‌ని అంబటి రాయుడు ( 90; 113 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ ( 45; 64 బంతుల్లో, 4 ఫోర్స్) ఆదుకున్నారు.
బౌల్ట్, హెన్రీలు నిప్పులు చెరిగే బంతులు విసరడంతో రోహిత్ శర్మ (16 బంతుల్లో 2) , శిఖర్ ధావన్ (13 బంతుల్లో 6, 1 ఫోర్) , శుభమన్ గిల్ (11 బంతుల్లో 7 ; 1 ఫోర్), ధోని ( 6 బంతుల్లో 1 ) త్వరగా పెవిలియన్‌కి చేరారు. ముఖ్యంగా తొలి బంతి నుండి చాలా ఓపికగా ఆడుతూ వచ్చిన అంబటి రాయుడు కెరీర్‌లో పదో అర్ధ సెంచరీ చేసి 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.