దేశంలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు..

73

దేశంలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదే విధంగా నిన్న క‌రోనా నుంచి 9,265 మంది కోలుకున్నారు. మ‌రో 393 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య‌ 559 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. క‌రోనాతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.