తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు..

45

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి పినేపి విశ్వరూప్, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌లు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.