వేద విద్యార్థుల విషాదంపై స్వరూపానందేంద్ర స్వామి స్పందన..

34

మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందని స్వరూపానందేంద్ర స్వామి విచారం వ్యక్తం చేశారు. కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాటశాల విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ఉన్న శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాల వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని ఆయన అన్నారు. వారి కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని తెలిపారు. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి మేము సుముఖంగా ఉన్నామన్నారు స్వరూపానందేంద్ర స్వామి.