తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి కపూర్..

47

తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిలు జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, రాజస్థాన్ మంత్రి శంకుతల రావత్, ప్రముఖ నటి జాహ్నవి కపూర్, ఏపీ ప్రభుత్వ విఫ్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.