దేశంలో కొత్తగా 2,64,202 కోవిడ్‌ కేసులు నమోదు..

33

దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుని 12,72,073 కేసులు ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతానికి పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,09,345 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,753కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది.