‘రావణాసుర’ విడుదలకు ముహుర్తం ఖరారు..

25

టాలీవుడ్‌ హీరో రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం రావణాసుర. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రవితేజ కొత్త పోస్టర్ ను వదిలారు. గాయాలతోనే రవితేజ సిగార్ వెలిగిస్తున్న ఈ పోస్టర్ .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో సుశాంత్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు.ఈ పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది.