దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు…

178
corona
- Advertisement -

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరగా ఢిల్లీలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.

ఒమిక్రాన్ కేసుల‌తో పాటుగా క‌రోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండ‌టంతో కేంద్ర ఆరోగ్య‌శాఖ కేంద్రాల‌కు లేఖ‌లు రాసింది. దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ‌త రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంద‌ని, దీనిపై దృష్టి పెట్టాల‌ని సూచించారు.

కేర‌ళ‌, సిక్కిం, మిజోరాం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటి రేటు 10 శాతం కంటే ఎక్కువ‌గా ఉంద‌ని, మిగ‌తా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటి రేటు 5 నుంచి 10 శాతంగా న‌మోదవుతున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూలు విధించాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ రాష్ట్రాల‌కు సూచించింది.

- Advertisement -