ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్‌పై క్లారిటీ!

39
rajamouli

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్స్‌పై దృష్టిసారించింది చిత్రయూనిట్. ఇక సినిమా ప్రీమియర్స్‌పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి.

హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రాజమౌళి….ప్రస్తుతం పెయిడ్ ప్రీమియర్స్‌పై ఎలాంటి ప్లాన్‌లు లేవని, అయితే డిస్ట్రిబ్యూటర్లతో, నిర్మాతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంపిణీదారులు, మా నిర్మాత ఓకే అంటే మేము ఖచ్చితంగా ప్రీమియర్‌లను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాము అని రాజమౌళి అన్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.