అవిశ్వాస తీర్మానం…ఎన్ని సక్సెస్‌ తెలుసా?

25
- Advertisement -

దేశంలో అవిశ్వాసత తీర్మానం ప్రవేశపెట్టడం కొత్తేమీ కాదు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే చివరి అస్త్రం అవిశ్వాస తీర్మానం. అయితే కొన్ని సందర్భాల్లో అవిశ్వాస తీర్మానం సక్సెస్ అయితే మరికొన్ని సార్లు విఫలమయ్యాయి. అవిశ్వాస తీర్మానం విఫలమైన ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాలపై తాము చెప్పాలనుకున్న దానిపై ఒత్తిడి చేసి నైతికంగా సక్సెస్ సాధించాయి.

అయితే దేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు..ఎన్ని సక్సెస్ అయ్యాయో చూద్దాం. గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‭పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయింది. కానీ నరేంద్రమోడీ సర్కార్‌ రెండోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుండగా ఎలాంటి ప్రమాదం మాత్రం లేదు. 2019లో తొలిసారి అవిశ్వాస తీర్మాన్ని ఎదుర్కొగా విపక్షాలకు బలం లేక వీగిపోయింది. ఈసారి అలాంటి పరిస్థితే ఎదురుకావడం ఖాయం.

Also Read:మిసైల్ మ్యాన్‌..అబ్దుల్ కలాం

భారత పార్లమెంటు చరిత్రలో 28 సార్లు అవిశ్వాస తీర్మానం రాగా మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని దేశ మొదటి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారు. ఇక అతి ఎక్కువసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నది ఇందిరా గాంధీ. ఆమె ప్రభుత్వం మీద 15 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు.

తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు ప్రభుత్వాలు మూడేసి సార్లు,మొరార్జీ దేశాయ్, ప్రస్తుత నరేంద్రమోడీ తాజా దానితో కలుపుకుని రెండు సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‭పేయి, వీపీ సింగ్, దేవె గౌడ ఒక్కోసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొగా అటల్ బిహారీ వాజ్‭పేయి, వీపీ సింగ్, దేవె గౌడ విశ్వాస పరీక్షలో తమ బలాన్ని నిరూపించలేక రాజీనామా చేశారు. ఇందులో వాజ్‌పేయ్‌ కేవలం ఒకే ఓటుతో విశ్వాస పరీక్షలో గెలవలేకపోయారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘టిల్లు స్క్వేర్’ సాంగ్

- Advertisement -