- Advertisement -
హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత క్రికెట్ జట్టు 1-2 తేడాతో ఓటమి పాలై పర్యటనను ముగించింది. కివీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఒడుదొడుకులకు లోనైంది. విజయ్ శంకర్, రిషభ్ పంత్ సిక్సర్లు కనువిందు చేశాయి. చివర్లో కృనాల్ పాండ్య, దినేశ్ కార్తీక్ చక్కని భాగస్వామ్యంతో గెలిచేలా కనిపించినా రోహిత్ సేన 4 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.
213 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ పోరాడి ఓడింది. ధావన్ (6) పరుగులు,రోహిత్ శర్మ (38), విజయ్ శంకర్ (43),రిషభ్ పంత్ (28), హార్దిక్ పాండ్యా (21), ధోని (2), దినేష్ కార్తీక్ (33), కృణాల్ పాండ్యా (26) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్ మెన్ మన్రోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సీఫ్రెట్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
- Advertisement -