అందులో నా పాత్ర మీకు నచ్చుతుంది- రకుల్

270
Rakul Preet
- Advertisement -

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల అవుతుండగా, రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యింది.

Rakul Preet

ఈ సందర్బంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చిన ప్రతి సారి మీ రెస్పాన్స్ చూస్తే చాల సంతోషంగా ఉంది.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన.. చాల పవర్ ఫుల్ రోల్.. ఇండిపెండెంట్ వుమన్ క్యారెక్టర్…మీ అందరికి నా పాత్ర నచ్చుతుంది.. ముందుగా నాకు ఈ పాత్ర ఇచ్చిన అందరికి చాల థాంక్స్.. ఖాకీ టైం లోనే కార్త్‌తో మంచి అనుబంధం ఏర్పడింది.. మళ్ళీ ఈ సినిమా కూడా ఖాకీ లాగే మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను.

ఇక డైరెక్టర్ రజత్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్.. కొత్త డైరెక్టర్ లాగ ఎక్కడా అనిపించలేదు.. సినిమాలో అన్ని ఎమోషన్స్‌ని పండించారు.. ఆయనకు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.. లక్ష్మణ్ చాలా సపోర్ట్ చేశారు.. నిర్మాతగా ఎం చేయాలో అన్ని చేశారు.. ఈ సినిమాకి పనిచేసిన అందరికి చాల థాంక్స్.. అందరు ఫిబ్రవరి 14న సినిమా చూడండి.. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది.. తప్పకుండ ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి అన్నారు.

- Advertisement -