- Advertisement -
ఇంగ్లాండ్‌తో మొతెరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 160 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 294 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్…మరో 71 పరుగులు జోడించి ఆలౌటైంది. తొలి రోజు పంత్‌తో కలిసి ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కొల్పోయారు.
సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు ఎనిమిదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్ 43 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకోగా.. జేమ్స్ అండర్సన్ మూడు, లీచ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 రన్స్‌కు ఆలౌటైంది.
- Advertisement -