శర్వా బర్త్ డే గిఫ్ట్…ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు

75
sharwanand

టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్‌ రేటును అంతకంతకూ పెంచుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వాకు ఉన్న క్రేజే వేరు. కథల ఎంపికలో జాగ్రత్త…వైవిధ్యానికి పెద్దపీట వేసే ఈ హీరో టాలీవుడ్‌లో నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారాడు. ప్రస్తుతం శ్రీకారం, మ‌హా స‌ముద్రాలు అనే సినిమాలు చేస్తున్న శ‌ర్వా త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొత్త సినిమా టైటిల్ ప్ర‌క‌టించాడు.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాకు ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు అనే పేరును ఖరారు చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది చిత్రయూనిట్. శర్వా సరసన ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కాగా, ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు అనే చిత్రాన్ని 2017లో వెంక‌టేష్‌తో చేయాల‌ని అనుకున్నాడు కిషోర్. ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌లేదు.