అండర్ 19 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 2020 జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియం గార్గ్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ మేరకు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
గ్రూప్- ఏలో భారత్‌తో పాటుగా జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకుంది.
అండర్-19 భారత జట్టు:
ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంగ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్
Uttar Pradesh’s Priyam Garg to lead India in U-19 World Cup 2020Mumbai’s Yashasvi Jaiswal, who became the youngest batsman to hit a List