గూగుల్‌ మ్యాప్స్‌… లేడీ వాయిస్‌ ఎవరిదో తెలుసా..!

346
google girl

కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మానవుడి ఆలోచనాశక్తి పరిమితి ప్రపంచం ఒక కుగ్రామంగా కుదించబడిందని చెప్పొచ్చు. దేశ విదేశాల్లో ఉన్నవారితో స్నేహం చేసే ఆవకాశం స్మార్ట్ ఫోన్లతో సాధ్యమవుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన నిమిషాల వ్యవధిలో తెలుసుకోగులుగుతున్నాం.

పెరుగుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన వివిధ యాప్‌ల సాయంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉదహరణకు గతంలో మనకు తెలియని రూట్‌లో ప్రయాణం చేయాలంటే దారి వెంట వెళ్లేవారిని అడుగుతూ రూట్ కనుక్కొని వెళ్లే వాళ్లం. కానీ గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతరుల మీద ఆధారపడే పద్దతి మారింది. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం..ఎక్కడకు వెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో ఎంటర్ చేస్తే చాలు మీ గమ్యస్ధానం ఎంతదూరంలో ఉంది..?ఎంత సమయంలో చేరుకోవచ్చు…?ట్రాఫిక్‌ పరిస్థితిని కచ్చితంగా చూపించగులుగుతుంది.

అయితే ఇదంతా ఫోన్ డిస్‌ప్లే మీద చూపించడంతో పాటు ఓ అందమైన లేడివాయిస్‌తో వినిపిస్తుంది గూగుల్. ఫలానా మార్గంలో వెళ్లమని, ఫలానా స్టాప్‌ వద్ద మలుపు తిరగమని, ఆగమని చెబుతూ డైరెక్షన్స్‌ ఇస్తుంది. అయితే ఇప్పటివరకు చాలామంది ఈ వాయిస్ సిస్టమ్‌ కమాండ్ చేసిందని భావించే వారు. కానీ ఆ లేడీ వాయిస్‌ ఎవరిదో తెలుసా..? అమెరికాకు చెందిన పాపులర్ సింగర్‌ కారిన్ ఎలిజబిత్ జాకబ్‌సన్‌ది.

కారెన్‌ వాయిస్‌ గూగుల్ మ్యాప్స్‌కు సెట్‌ అవుతుందని భావించడంతో గూగుల్ సంస్థ ఆమె వాయిస్‌ను గూగుల్‌ మ్యాప్స్‌లోని నావిగేషన్‌లో ఏర్పాటు చేసింది. ఇక కారెన్‌ తన వాయిస్‌ను గూగుల్‌ మ్యాప్స్‌కు ఇవ్వడంతో ఇప్పుడందరూ ఆమెను జీపీఎస్‌ గర్ల్ అని పిలుస్తున్నారు.

When you drive with Google map(GPS location) on, you are always guided by a lady’s voice giving you direction..Karen Elisabeth Jacobsen Australian born American singer