మన్మోహన్‌ సింగ్‌ గురించి మీకు తెలియని నిజాలు

170
manmohan
- Advertisement -

భారతదేశ 13వ మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్‌ 26వ రోజున 90వ వసంతంలోకి అడుగుపెట్టారు.  భారతీయ గ్రామీణ ప్రజలకు మన్మోహన్‌ సింగ్‌ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న    మన్మోహన్‌… 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్‌ సింగ్‌ తొలి హిందువేతర, తొలి సిక్కు ప్రధానిగా చరిత పుటల్లో నిలిచారు. 1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన…ఆర్ధిక విజ్ఞత కలిగిన, దూరదృష్టి కలిగిన నేతగా కీర్తిని గడించారు. మన్మోహన్‌ సింగ్‌ ఎన్నో పదవులను అలంకరించారు. మరెన్నో అవార్డులు ఇతన్ని వరించాయి.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ భారతదేశ విభజనకు ముందు ఉన్న పంజాబ్‌ ఫ్రావిన్స్‌లో(పాకిస్థాన్‌) సెప్టెంబర్‌26, 1932న జన్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంకు వలస వచ్చిన మన్మోహన్‌ సింగ్‌… పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను పొందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయంతో పాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అద్యాపకుడిగా సేవలు అందించారు.

మన్మోహన్‌ సింగ్‌ ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధానులుగా ఉన్న కాలంలో దేశంలో పలు కీలక పదవులను పొందారు. 1972 నుంచి 1976 వరకు ఇందిరాగాంధీకి చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వేయిజర్‌గా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు ఇందిరాగాంధీ కాలంలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించి అనేక సంస్కరణలను అమలు పరిచారు. 1985 నుంచి 1987 వరకు రాజీవ్‌ గాంధీ కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా వ్యవరించారు.

1991లో పివీ నరసింహరావు ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా సేవలందించి భారత అర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఎల్పీజీలను ప్రవేశపెట్టి ఆర్థిక వ్వవస్థను నిలదోక్కుకొవడంలో అవిరళంగా కృషి చేశారు. 1991 నుంచి 1996 వరకు పివీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసే రోజుల్లో ఈయన సేవలకు గాను… 1993 లో యూరోమనీ, 1994 ఆసియామనీ పురస్కారాలు అందుకున్నారు.

2004లో యూపీఏ హయాంలో 13వ దేశ ప్రధానిగా పనిచేసి అనేక రంగాల్లో దేశం పురోగమించేందుకు చర్యలు చేపట్టారు. 2009 లో రెండవ సారి అధికారంలో వచ్చిన యూపీఏ హయాంలో మరోక సారి ప్రధానిగా పనిచేశారు. ఇదే కాలంలో 2010లో సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్‌ఆజీజ్ పురస్కారం ఆయన అందుకున్నారు. 2014లో జపాన్‌ ప్రభుత్వం నుంచి  అత్యున్నతమైన గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పౌలోనియా ఫ్లవర్స్ అవార్డును సొంతం చేసుకున్నారు.

- Advertisement -